హీరో ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలలో వర్షం కూడా ఒకటి. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటించగా.. గోపీచంద్ విలన్‌గా నటించాడు. ఈ సినిమాకు శోభన్ దర్శకత్వం వహించగా.. సుమంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎమ్ ఎస్ రాజు ఈ సినిమాను నిర్మించారు. 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌ను అందుకోవడమే కాకుండా.. ప్రభాస్‌కి మొదటి బ్లాక్ బస్టర్‌ను అందించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాను మే 23, 2025న మళ్లీ రీ-రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ సినిమాను 4K రిజల్యూషన్‌తో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను షేర్ చేశారు.
- April 29, 2025
0
71
Less than a minute
Tags:
You can share this post!
editor

