RGV ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై వాయిదా పడిన విచారణ..

RGV ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై వాయిదా పడిన విచారణ..

డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈనెల 27కు ఏపీ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌పై ఫొటోలు మార్ఫింగ్  చేసి ఎక్స్‌లో పోస్ట్ చేసిన వ్యవహారంలో రాంగోపాల్‌ వర్మపై ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాలో కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో కేసులో పోలీసులు రెండుసార్లు నోటీసులు అందించినా వర్మ విచారణకు హాజరుకాలేదు, పట్టించుకోలేదు, దీంతో వర్మ కోసం పోలీసులు హైదరాబాద్‌, తమిళనాడులో గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో హైకోర్టులో ఆర్జీవీ ముందస్తు బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ వేశారు. ఆర్జీవీ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుగగా విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ నెల 23న కోయంబత్తూరులో షూటింగ్‌లో పాల్గొన్నట్టు తెలియజేస్తూ.. యాక్టర్లతో దిగిన ఫొటోలను ఎక్స్‌లో ట్వీట్ చేశాడు వర్మ. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు రాంగోపాల్ వర్మ కోసం కోయంబత్తూరు వెళ్లినట్టు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే వర్చువల్‌గా విచారణకు హాజరవుతారని వర్మ లీగల్‌ టీం పోలీసులకు తెలియజేసిన విషయం తెలిసిందే. ఒంగోలు పోలీసులు మొదట హైదరాబాద్‌లోని ఆర్జీవీ ఇంటికి కూడా వెళ్లారు. అయితే వర్మ అక్కడ లేకపోవడంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారని తెలిసిందే. వర్మ ఫోన్ స్విచాఫ్‌ అయినట్టు కూడా వార్తలు వచ్చాయి. కాగా వర్మ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్ట్‌లో విచారణ చేపట్టనుంది.

editor

Related Articles