పూనమ్ కౌర్ : ఓ డైరెక్టర్ ఒక అమ్మాయిని ప్రెగ్‌నెంట్‌ చేశాడు

పూనమ్ కౌర్ : ఓ డైరెక్టర్ ఒక అమ్మాయిని ప్రెగ్‌నెంట్‌ చేశాడు

టాలీవుడ్ న‌టి పూనం కౌర్ మ‌రో సంచ‌ల‌న పోస్ట్ పెట్టి గలాటా సృష్టిస్తోంది. టాలీవుడ్‌లోని ఒక ద‌ర్శ‌కుడు ఒక అమ్మాయికి అవకాశాలు ఇస్తాన‌ని చెప్పి మోసం చేసి గర్భవతిని చేశాడు అంటూ పూనమ్ కౌర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. న‌టి పూనం కౌర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పవలసిన అవ‌స‌రం లేదు. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా ఈ పంజాబీ బ్యూటీకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రముఖ నిర్మాత చిట్టి బాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విష‌యం తెలిసిందే. పూనమ్‌కి పిచ్చి పట్టింది అందుకే ఇలా మాట్లాడుతోంది. ఆమెకు ఏమైనా జ‌రిగివుంటే ఫిలిం ఛాంబర్‌కి వచ్చి ఫిర్యాదు చేయాలి కానీ, ఇలా లేనిపోని కామెంట్లు చేయడం ఎందుకు అంటూ చిట్టిబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. అయితే ఈ వ్యాఖ్య‌ల‌పై చిట్టిబాబుపై విరుచుకుప‌డింది పూనం కౌర్. ఐతే దేవుడి దయవల్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ జోక్యంతో ఆ పంజాబీ బ్యూటీకి కాస్త సహాయం దొరికింది. ఇంతకీ పూనం చేసిన వ్యాఖ్య‌లు ఎవ‌రిపై అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

administrator

Related Articles