సమకాలీన హీరోయిన్లలో చాలామంది తమ సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తెరపై పాత్ర సహజంగా కనిపించడంతో పాటు అభిమానులకు కూడా మరింత చేరువ కావొచ్చనే ఉద్దేశ్యంతో ఓన్ డబ్బింగ్కే ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రస్తుతం ఈ హీరోయిన్ తమిళంలో సూర్య సరసన ‘రెట్రో’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకుడు. మే నెలలో విడుదలకానుంది. ఈ సినిమా కోసం పూజాహెగ్డే తమిళంలో సొంతంగా డబ్బింగ్ చెప్పింది. కెరీర్లో తొలిసారి తాను సొంతంగా డబ్బింగ్ చెప్పడం ఆనందంగా ఉందని, ఇకముందు అన్ని భాషల్లో ఇదే పద్ధతి ఫాలో అవుతానని పూజాహెగ్డే పేర్కొంది. తెలుగు సినిమాల్లో కూడా ఆమె ఓన్ డబ్బింగ్ చెప్పేందుకు సముఖంగా ఉందని తెలిసింది. గత కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న పూజాహెగ్డే ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీపైనే దృష్టి పెట్టింది. అక్కడ సూర్య ‘రెట్రో’, దళపతి విజయ్ ‘జన నాయగన్’, రాఘవ లారెన్స్ ‘కాంచన-4’ సినిమాల్లో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలు దక్షిణాదిన తనకు పూర్వ వైభవం తెచ్చిపెడతాయని ధీమా వ్యక్తం చేస్తోంది పూజాహెగ్డే.
- March 14, 2025
0
105
Less than a minute
Tags:
You can share this post!
editor

