కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు హీరో అక్కినేని అఖిల్. గత సినిమా ‘ఏజెంట్’ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో తదుపరి సినిమాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రస్తుతం అఖిల్ స్వీయ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ సినిమాని తీస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకుడు. ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. నేటి నుండి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్లు తెలిసింది. రాయలసీమ నేపథ్యంలో పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. అధికభాగం చిత్తూరు జిల్లాలో షూటింగ్ చేస్తారట. శ్రీలీలను హీరోయిన్‌గా తీసుకునే అవకాశముందని తెలిసింది. ఈ సినిమాకి ‘లెనిన్’ అనే టైటిల్‌ను పెట్టబోతున్నారని వార్తలొస్తున్నాయి. దసరా బరిలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు మొదలుపెట్టారు.

- March 14, 2025
0
42
Less than a minute
Tags:
You can share this post!
editor