అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ సినిమా ‘తండేల్’ ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి డైరెక్ట్ చేయగా, పూర్తి రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమా ప్రమోష్‌నల్ కంటెంట్ కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది, దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే, ఈ సినిమాకు టికెట్ రేట్ల విషయంలో పెంచుకోడానికి ప్రభుత్వం నుండి తాజాగా క్లారిటీ వచ్చింది. ఏపీ ప్రభుత్వం ఈ సినిమాకి సింగిల్ స్క్రీన్స్‌కు రూ.50, మల్టీప్లెక్స్‌లో రూ.75 మేర టికెట్ రేట్ల పెంపు ఉండనుంది. దీంతో ఏపీలో సింగిల్ స్క్రీన్స్‌లో రూ.197.50, మల్టీప్లెక్స్‌లో రూ.252 గా టికెట్ రేట్లు ఉండబోతున్నాయి. ఇక తెలంగాణలో ఎలాంటి టికెట్ రేట్ల పెంపు లేకుండానే సింగిల్ స్క్రీన్స్‌లో రూ.177, మల్టీప్లెక్స్‌లో రూ.295 ఉండనుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవి నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

- February 5, 2025
0
19
Less than a minute
Tags:
You can share this post!
editor