మార్చి 28న గ్రాండ్‌గా “రాబిన్‌హుడ్” రిలీజ్!

మార్చి 28న గ్రాండ్‌గా “రాబిన్‌హుడ్” రిలీజ్!

నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్‌గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న సినిమా “రాబిన్‌హుడ్” గురించి అందరికీ తెలిసిందే. నితిన్ అభిమానులు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ఈ సినిమా నిజానికి గత ఏడాదిలోనే రిలీజ్ కావాల్సి ఉంది కానీ కొన్ని అవాంతరాల వల్ల ఈ ఏడాదికి మేకర్స్ షిఫ్ట్ చేశారు. ఇక ఈ సినిమా నుండి లేటెస్ట్‌గా సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో “ఆదిపురుష్” సినిమాలో భజరంగ్ పాత్రలో కనిపించిన బాలీవుడ్ నటుడు దేవదత్త జి నాగ్ విలన్ రోల్ చేస్తున్నట్టుగా తనపై సాలిడ్ పోస్టర్‌ని మేకర్స్ ఇప్పుడు తన బర్త్ డే కానుకగా రిలీజ్ చేశారు. మరి ఈ సరికొత్త లుక్‌లో ఈ నటుడు మంచి డైనమిక్‌గా కనిపిస్తుండగా తాను సామి అనే రోల్‌లో కనిపించనున్నట్టుగా మేకర్స్ చెబుతున్నారు. మరి ఇటీవల మరో తెలుగు సినిమా “దేవకీ నందన వాసుదేవ” సినిమాలో కూడా విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఇక రాబిన్ హుడ్‌లో తాను ఎలా నటిస్తాడో చూడాలి.

editor

Related Articles