మార్చి 21న రిలీజ్‌కి సిద్ధమైన ‘పెళ్లికాని ప్రసాద్‌’

మార్చి 21న రిలీజ్‌కి సిద్ధమైన ‘పెళ్లికాని ప్రసాద్‌’

సప్తగిరి హీరోగా, అభిలాష్‌రెడ్డి గోపిడి దర్శకత్వంలో ఓ వినోదాత్మక సినిమా రూపొందుతోంది. కె.వై.బాబు, భానుప్రకాష్‌ గౌడ్‌, సుక్కా వెంకటేశ్వర్‌గౌడ్‌, వైభవ్‌రెడ్డి ముత్యాల నిర్మాతలు. నిర్మాత దిల్‌రాజు మార్చి 21న ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ప్రమోషన్‌లో భాగంగా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌తో సహా ఈ సినిమాకు చెందిన కొన్ని ఆసక్తికరమైన అప్‌డేట్లను నిర్మాతలు రివీల్‌ చేశారు. ఈ సినిమాకు ‘పెళ్లికాని ప్రసాద్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌.. సప్తగిరి పాత్రలోని హ్యూమర్‌ నేచర్‌ని హైలైట్‌ చేస్తోంది. హై ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ సినిమా ఉంటుందని పోస్టర్‌ చెబుతోంది. ప్రియాంక శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా: సుజాత సిద్దార్థ్‌, సంగీతం: శేఖర్‌చంద్ర.

editor

Related Articles