విరాజ్ రెడ్డి చీలం హీరోగా రూపొందుతోన్న హర్రర్ ఎంటర్‌టైనర్ ‘గార్డ్’. ‘రివెంజ్ ఫర్ లవ్’ అనేది ఉపశీర్షిక. విమీ లినోర్డ్, శిల్పా బాలకృష్ణ కథానాయికలు. జగ పెద్ది దర్శకుడు. అనసూయ రెడ్డి నిర్మాత. ఈ నెల 28న సినిమా విడుదల కానుంది. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ని వినూత్నంగా విడుదల చేశారు. 12 మంది టాలీవుడ్ ప్రముఖుల చేతులమీదుగా ఈ ట్రైలర్ లాంచ్ జరగడం విశేషం. హీరోలు శ్రీకాంత్, తరుణ్, నిఖిల్ సిద్దార్థ్, సుధీర్‌బాబు, సుశాంత్, ఆది, అశ్విన్‌బాబు, సన్నీ వీజే, సామ్రాట్ ప్రిన్స్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, దర్శకుడు, వ్యాఖ్యాత ఓంకార్ అందరూ కలిసి తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ ట్రైలర్‌ని విడుదల చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. ఈ చిత్రానికి కెమెరా: మార్క్ కెన్ఫీల్డ్, సంగీతం: సిద్దార్థ్ సదాశివుని, ప్రణయ్ కాలేరు.

- February 25, 2025
0
21
Less than a minute
Tags:
You can share this post!
editor