న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ తన రూ.18 కోట్ల రుణాన్ని మాఫీ చేసినట్లు వచ్చిన వార్తలను ప్రీతి జింటా తప్పుబట్టారు. ఈ మేరకు ఆమె తన న్యాయవాద బృందం ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ప్రీతి జింటా పేరు బయటకు వచ్చింది. ఆమె దశాబ్దం క్రితం తన ఖాతాను మూసివేసినట్లు పుకార్లపై ఆమె స్పందించింది. ఈ కేసులో తనను బీజేపీతో ముడిపెట్టినందుకు కాంగ్రెస్‌పై ఆమె నిప్పులు చెరిగారు. తప్పుడు నివేదికలపై ఆమె స్పందిస్తూ, దశాబ్దం క్రితమే ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని తాను పరిష్కరించుకున్నట్లు వివరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల, బ్యాంకులో అవినీతి ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఆమె పేరు బయటకు వచ్చింది. రూ.18 కోట్ల లోన్‌కి సంబంధించిన వైరల్ రిపోర్ట్‌లకు సంబంధించి ప్రీతీ తన లీగల్ టీమ్ ద్వారా గాలి వార్తలను కొట్టిపడేసింది. 12 సంవత్సరాల క్రితం, నేను న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్‌లో ఓవర్‌డ్రాఫ్ట్‌పై లోన్ తీసుకున్నాను. 10 సంవత్సరాల క్రితం, నేను ఆ ఓవర్‌డ్రాఫ్ట్ లోన్‌కి సంబంధించి మొత్తం బకాయిలను పూర్తిగా చెల్లించాను, ఖాతా క్లోజ్ చేయబడింది, అని ఆమె వెల్లడించారు.

- February 25, 2025
0
18
Less than a minute
Tags:
You can share this post!
editor