పాయల్‌ రాజ్‌పుత్‌ – వెంకటలచ్చిమిగా…

పాయల్‌ రాజ్‌పుత్‌ – వెంకటలచ్చిమిగా…

‘ఆర్‌ఎక్స్‌ 100’ ‘మంగళవారం’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు చేరువైవ హీరోయిన్ పాయల్‌ రాజ్‌పుత్‌. ఆమె టైటిల్‌ రోల్‌ని పోషిస్తున్న తాజా సినిమా ‘వెంకటలచ్చిమి’ శుక్రవారం హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమైంది. పాన్‌ ఇండియా స్థాయిలో ఆరు భాషల్లో తెరకెక్కించబోతున్న ఈ సినిమాకి ముని దర్శకత్వం వహిస్తున్నారు. రాజా, ఎస్‌ఎస్‌ చౌదరి నిర్మాతలు. ఆదివాసీ మహిళ ప్రతీకార కథగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నామని, కథ, కథనాలు ఆసక్తికరంగా ఉంటాయని దర్శకుడు ముని పేర్కొన్నారు. ఈ కథ తనకు ఎంతగానో నచ్చిందని, ఈ సినిమా చూసిన ప్రేక్షకులు వెంకటలచ్చిమి అనే పేరుతో పిలుస్తారని, అంత బలమైన భావోద్వేగాలుంటాయని పాయల్‌ రాజ్‌పుత్‌ చెప్పింది. ఈ సినిమాకి సంగీతం: వికాస్‌ బడిశా.

editor

Related Articles