తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి అంటే హీరోయిన్ జాన్వీకపూర్‌కు అపరిమితమైన భక్తి. ప్రతి ఏడాది రెండు మూడుసార్లు స్వామివారిని దర్శించుకోవడం తనకు అలవాటు. తన పుట్టిన రోజుతో పాటు, అమ్మ దివంగత శ్రీదేవి జయంతి సందర్భంగా తిరుమలకు రావడం ఆమె ఆనవాయితీగా పెట్టుకుంది. ఓ టాక్‌షోలో పాల్గొన్న ఈ హీరోయిన్ తిరుమల దేవస్థానంపై మరోమారు భక్తిభావాన్ని చాటుకుంది. పెళ్లయిన తర్వాత భర్తతో కలిసి తిరుపతిలో సెటిల్ అవ్వాలనే ఆలోచన ఉందని చెప్పింది. అక్కడ సాధారణ జీవితాన్ని గడపాలన్నది తన కల అని, అరిటాకులో భోజనం చేస్తూ , నిత్యం గోవింద నామస్మరణ వింటూ కాలం గడపాలని కోరుకుంటున్నానని తెలిపింది. ముగ్గురు పిల్లల్ని కని అక్కడే ప్రశాంతగా సెటిల్ కావాలనుకుంటున్నానని, తిరుమల సంప్రదాయానికి అనుగుణంగా తన భర్తను కూడా లుంగీ ధరించమని చెబుతానని జాన్వీకపూర్ పేర్కొంది.

- January 25, 2025
0
28
Less than a minute
Tags:
You can share this post!
editor