నేడు కుంభమేళాకు బయలుదేరిన పవన్ కళ్యాణ్

నేడు కుంభమేళాకు బయలుదేరిన పవన్ కళ్యాణ్

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేడు కుంభ‌మేళ‌కు వెళుతున్నట్లు స‌మాచారం. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శనను విజ‌యవంత‌గా పూర్తిచేసుకున్నారు. త‌న కొడుకు అకీరాతో క‌లిసి కేర‌ళ, త‌మిళ‌నాడులోని ప్రసిద్ధ ఆలయాలను గ‌త వారం సంద‌ర్శించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. అయితే దక్షిణాది అనంత‌రం ఉత్త‌రాదికి వెళుతున్నారు ప‌వ‌న్. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న కుంభమేళాకు నేడు పవన్ కళ్యాణ్ వెళ్ల‌నున్నారు. కుటుంబ స‌మేతంగా ఆయ‌న త్రివేణి సంగమంలో పుణ్య‌ స్నానం ఆచ‌రించ‌నున్నారు.

editor

Related Articles