పవన్‌కళ్యాణ్‌ అస‌లు సమస్యలను పట్టించుకోవడం లేదు: ప్ర‌కాష్‌రాజ్

పవన్‌కళ్యాణ్‌ అస‌లు సమస్యలను పట్టించుకోవడం లేదు: ప్ర‌కాష్‌రాజ్

డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు న‌టుడు ప్ర‌కాష్‌రాజ్. ఇప్ప‌టికే చాలాసార్లు ప‌వ‌న్‌పై ఆరోప‌ణ‌లు చేసిన ప్ర‌కాష్‌రాజ్‌ తాజాగా మ‌రోసారి పవన్‌కళ్యాణ్‌ గురించి మాట్లాడారు. రీసెంట్‌గా ఒక ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. ప‌వ‌న్‌కి ఒక విజ‌న్ అంటూ లేద‌ని తెలిపారు. ఎన్నిక‌ల ముందు ప్ర‌జా స‌మ‌స్య‌ల గురించి మాట్లాడిన పవ‌న్ ఇప్పుడేమో స‌నాత‌న రక్ష‌కుడినంటూ మతం రంగు పూసుకున్నాడంటూ తెలిపారు. అధికారంలో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించకుండా సమయాన్ని ఎందుకు వృథా చేస్తున్నారని ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుతం ఉన్న యువ‌త నిరుద్యోగంతో బాధ‌ప‌డుతున్నారు. రోడ్లు బాగాలేవు. అవినీతి పెరిగిపోయింది వీటి గురించి ప‌ట్టించుకోవ‌డం వ‌దిలేసి స‌నాత‌న్ ర‌క్ష‌క్ అంటే ఎవ‌డికి ఉప‌యోగం అంటూ ప్ర‌కాష్‌రాజ్ అన్నారు.

editor

Related Articles