గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో ఇద్దరు అభిమానులు దుర్మరణం పాలవ్వడంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 4న తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారులో నిర్వహించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. కాకినాడకు చెందిన మణికంఠ, చరణ్ అనే ఇద్దరు అభిమానులు వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పవన్ కళ్యాణ్ రోడ్డు ప్రమాదంపై ఆవేదన వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు చెరి ఒక రూ.5 లక్షల చొప్పున సహాయాన్ని ప్రకటించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రకటించారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బాధిత కుటుంబాలను పరామర్శించి రూ.5 లక్షల చెక్కులను అందజేశారు.
- January 7, 2025
0
345
Less than a minute
Tags:
You can share this post!
administrator

