ప‌.గో. జిల్లా అమ్మాయిని పెళ్లాడనున్న ప్ర‌భాస్..! క్లూ ఇచ్చిన రామ్‌చ‌ర‌ణ్‌

ప‌.గో. జిల్లా అమ్మాయిని పెళ్లాడనున్న ప్ర‌భాస్..! క్లూ ఇచ్చిన రామ్‌చ‌ర‌ణ్‌

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ ఎవ‌రైనా ఉన్నారంటే.. అది మ‌న డార్లింగ్ ప్ర‌భాస్ మాత్ర‌మే. అయితే ఇండ‌స్ట్రీలో ఉన్న హీరోయిన్‌ను రెబ‌ల్ స్టార్ పెళ్లాడతార‌ని అనేక వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు. ప్ర‌భాస్ పెళ్లిపై హీరో రామ్ చ‌ర‌ణ్ హింట్ (క్లూ) ఇచ్చారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రమోషన్స్ కోసం హీరో రామ్ చరణ్.. బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ షోలో ఆసక్తికరమైన విషయాలు షేర్ చేశారు. బాలయ్య.. ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావనకు తీసుకురాగా ప్రభాస్ ఫ్యాన్స్‌కు తీపి క‌బురు అందించారు. అవును.. షోలో ప్రభాస్ ఏ ఊరి అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నాడో చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ అమ్మాయి ఎవరో కాదు.. పదహారు అణాల తెలుగు అమ్మాయి. ప‌శ్చిమ‌ గోదావరి జిల్లా గణపవరంకు చెందిన అమ్మాయిని ప్ర‌భాస్ పెళ్లాడ‌బోతున్న‌ట్లు చరణ్ వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

editor

Related Articles