టాలీవుడ్ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి, హీరో మహేష్‌బాబు కాంబోలో SSMB 29 సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఇక షూటింగ్ ప్రారంభం కావడమే ఆలస్యం. సినిమా లవర్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ సినిమాను తలపించేలా ఈ సినిమా ఉండబోతుందని రాజమౌళి ఇప్పటికే హింట్ ఇచ్చాడు. మహేష్‌బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఛాన్స్ కొట్టేసినట్లు ఫిలిం ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత SSMB 29 సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్లు సమాచారం. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌సిటీతోపాటు, నగర శివార్లలో కొన్ని భారీ సెట్లను కూడా రూపొందించారు. వెయ్యికోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ సినిమాను నిర్మాత కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు. తొలి షెడ్యూల్ వాటిలోనే జరుగుతుందట. తర్వాతి షెడ్యూల్ విదేశాలలో ఉంటుందట. ఈ సినిమా అధికారిక ప్రకటనకు సంబంధించిన గ్లింప్స్ ఇప్పటికే సిద్ధమైందని, త్వరలో ఇతర నటీనటుల్ని కూడా పరిచయం చేసే అవకాశం ఉందని చిత్రబృందం చెబుతోంది. అనవాయితీ ప్రకారం త్వరలోనే ఓ ప్రెస్‌మీట్‌ను కూడా రాజమౌళి పెట్టనున్నారట.

- December 28, 2024
0
11
Less than a minute
Tags:
You can share this post!
editor