చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది. అమ్మడిలో కొత్త కోణాన్ని బయట పెడుతోందా? అంటే అవుననే కోలీవుడ్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. నిత్యామీనన్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రల్లోనైనా ఒదిగిపోతుంది. నటిగా తనంకటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది. దక్షిణాదిన అన్ని భాషల్లోనూ నటించింది. కానీ ఏనాడు గ్లామర్ పాత్రల జోలికి వెళ్లింది లేదు. స్కిన్ షోలు చేసింది లేదు. ఆఫ్ ది స్క్రీన్ ఎలా ఉంటుందో? ఆన్ ది స్క్రీన్ పై కూడా నిత్య డ్రెస్సింగ్ సెన్స్ అలాగే ఉంటుంది. అయితే అమ్మడిప్పుడు ఆ గీత దాటి బయటకు వస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఓ సినిమా కోసం ఏకంగా హీరోతో లిప్ లాక్ సన్నివేశాల్లోనే నటించిందనే వార్త కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతోంది. జయం రవి హీరోగా కిరుతిగ ఉదయనిధి ‘కాదిలిక్క నేర మిళ్లై’ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇందులో రవికి జోడీగా నిత్యామీనన్ నటిస్తోంది. ఇదొక రొమాంటిక్ లవ్ స్టోరీ. ఈ సినిమా ప్రచారం పనులు కూడా మొదలయ్యాయి. లిరికల్ సింగిల్స్ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో నిత్యా మీనన్ హీరోతో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించిందట. కథలో ఓ సన్నివేశం లిప్ లాక్ సన్నివేశం డిమాండ్ చేయడంతో? నిత్యా మీనన్ నో చెప్పకుండా ప్రొసీడ్ అంది. సాధారంణంగా లిప్ లాక్ సన్నివేశాలంటే? నిత్యామీనన్ నటించదు. అలాంటి సన్నివేశాలు ఏవైనా ఉన్నాయా? అని ప్రాజెక్ట్‌కి సైన్ చేసే ముందే డైరెక్టర్‌ని అడుగుతుంది. పాత్ర పూర్తిగా తనకి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటేనే అగ్రిమెంట్ చేసుకుంటుంది.

- December 21, 2024
0
16
Less than a minute
Tags:
You can share this post!
editor