ఆనంద్ వర్ధన్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘నిదురించు జహాపన’. కుమార్ దేవరపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సామ్, వంశీకృష్ణవర్మ నిర్మాతలు. నవమి గయాక్, రోష్ని సాహోతా హీరోయిన్లు. ఈ నెల 14న విడుదలకానుంది. బుధవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఒక ప్రేమకథకు, నిద్రకు సంబంధం ఏమిటన్నదే సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్ అని, ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్‌గా మెప్పిస్తుందని, సంగీతానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందని హీరో ఆనంద్ వర్ధన్ చెప్పారు. ఈ సినిమా కథ మొత్తం నిద్ర చుట్టే తిరుగుతుందని, వినూత్నమైన పాయింట్‌తో ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తుందని దర్శకుడు తెలిపారు. కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ పేర్కొన్నారు. రామరాజు, పోసాని కృష్ణమురళి, కల్పలత గార్లపాటి, కంచరపాలెం రాజు తదితరులు నటించారు.

- February 13, 2025
0
17
Less than a minute
Tags:
You can share this post!
editor