రెండు రోజుల్లో ‘రావు బహదూర్’ ఎంత రాబట్టింది?

రెండు రోజుల్లో ‘రావు బహదూర్’ ఎంత రాబట్టింది?

టాలీవుడ్ నటుడు సత్యదేవ్ హీరోగా, దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన ‘రావు బహదూర్’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు మంచి అంచనాలు నెలకొన్న ఈ సినిమా థియేటర్లలో మిశ్రమ స్పందనను అందుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద తొలి రెండు రోజుల్లో డీసెంట్ వసూళ్లను నమోదు చేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.6.3 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మిశ్రమ టాక్ వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో తొలి వారాంతంలో వసూళ్లు కీలకంగా మారాయి. ముఖ్యంగా ఆదివారం కలెక్షన్లు సినిమా బాక్సాఫీస్ ప్రయాణంపై ప్రభావం చూపనున్నాయి.

ఈ సినిమాకి స్మరన్ సాయి సంగీతం అందించగా, దీపా థామస్ హీరోయిన్‌గా నటించారు. మహేష్ బాబు చింతా, గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, ఈశ్వరన్ విజయరాఘవన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Related Articles