హీరో నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్‌లో ‘హిట్-3’ సినిమాని తెరకెక్కిస్తున్న నాని.. మరో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ అనే సినిమాను కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు రెండు వైవిధ్యమైన నేపథ్యంలో రాబోతున్నాయి. ఇక ఇప్పుడు నాని మరో క్లాసిక్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్‌లో ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర’ త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాలో కింగ్ అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల నానితో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. దీంతో నాని కోసం శేఖర్ కమ్ముల ఎలాంటి కథను రెడీ చేస్తాడా.. ఈ సినిమాతో వీరిద్దరి కాంబినేషన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మరి నిజంగానే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రానుందా అనేది వేచి చూడాలి.

- February 12, 2025
0
20
Less than a minute
Tags:
You can share this post!
editor