దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు హీరో ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ అందుకోవడమే కాకుండా రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా తదుపరి తారక్ వార్ 2 సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రంలో తారక్ నెగిటివ్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. అయాన్ ముఖర్జీ ఈ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుండగా.. రీసెంట్‌గా ఎన్టీఆర్ కూడా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి ముంబై టూర్ వెళ్లారు.

- October 19, 2024
0
32
Less than a minute
Tags:
You can share this post!
administrator