కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం (73) మృతిపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసిన విషయం తెలిసిన వెంటనే చిరంజీవి ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు. “మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరనే వార్త ఎంతో బాధాకరం. ప్రజా సమస్యల పట్ల ఆయన చూపిన నిబద్ధత, తన నమ్మకాల కోసం రాజీ పడని వ్యక్తిత్వం, సమాజం పట్ల ఆయనకున్న అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి” అని చిరంజీవి పేర్కొన్నారు.
ముద్రగడ పద్మనాభం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

