యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్- అప్స్’ సినిమాలోని ‘తబాహి’ వీడియో సాంగ్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ముఖ్యంగా యశ్, కియారా అద్వానీ మధ్య ఉన్న రొమాంటిక్ సన్నివేశాలపై కొందరు నెటిజన్లు కియారాను ట్రోల్ చేస్తున్నారు. దీనిపై సినిమాలో నటిస్తున్న బ్రిటిష్ నటుడు బెనెడిక్ట్ స్పందించారు. యశ్‌ను ప్రశంసిస్తూ, అదే సన్నివేశాల కోసం కియారాను మాత్రమే విమర్శించడం సరికాదని ఆయన అన్నారు. ‘‘యశ్‌కు కూడా పెళ్లయింది.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా ఆయనపై ఎలాంటి విమర్శలు రావడం లేదు. కానీ కియారా మాత్రం పెళ్లైన తర్వాత ఇలాంటి సన్నివేశాల్లో నటించడంపై ట్రోలింగ్‌కు గురవుతోంది. ఈ ద్వంద్వ వైఖరి సరైంది కాదు’’ అని వ్యాఖ్యానించారు.
నటీనటులు తమ పాత్రలకు అనుగుణంగా నటిస్తారని, వ్యక్తిగత జీవితాన్ని సినిమాలతో ముడిపెట్టి విమర్శించడం తగదని బెనెడిక్ట్ పేర్కొన్నారు.

