ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా ‘రాకా’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. భారీ వీఎఫ్‌ఎక్స్ పనుల కారణంగా ఈ సినిమా 2027 చివర్లో లేదా 2028లో విడుదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా తర్వాత బన్నీ, తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో మరో భారీ ప్రాజెక్ట్ చేయనున్నట్లు సమాచారం. అలాగే మలయాళ దర్శకుడు బసిల్ జోసెఫ్‌తో కూడా సినిమా దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. బసిల్ ఇటీవల సోషల్ మీడియాలో ‘Icon’ క్యాప్‌తో ఫొటో షేర్ చేయడంతో ఈ వార్తలకు మరింత ఊతమిచ్చింది.
ఈ వరుస కమిట్‌మెంట్ల నేపథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ‘పుష్ప 3’ మరింత ఆలస్యమయ్యే అవకాశాలపై చర్చ మొదలైంది. అట్లీ, లోకేష్, బసిల్ ప్రాజెక్టులు పూర్తయ్యాకే ‘పుష్ప 3’ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

