సెలబ్రిటీల ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్లు ఇటీవల చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో నటి పాయల్ రాజ్‌పుత్ కూడా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కు సబ్స్క్రిప్షన్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే దీనిపై కొందరు నెటిజన్లు ట్రోల్ చేయడంతో ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
తన సబ్స్క్రిప్షన్ ఛానల్లో ఎలాంటి కంటెంట్ ఉంటుందో స్పష్టంగా వెల్లడించిన పాయల్, బోల్డ్ లేదా హాట్ కంటెంట్ కోసం ఎవరూ సబ్‌స్క్రైబ్ చేయొద్దని పేర్కొన్నారు.
“చాలా మంది నా ఛానల్లో ఎలాంటి కంటెంట్ ఉంటుందని అడుగుతున్నారు. ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాను. మీరు బోల్డ్ కంటెంట్ ఆశించి సబ్‌స్క్రైబ్ చేయాలనుకుంటే ఇది మీ కోసం కాదు. నా నిజమైన జీవితం, షూటింగ్‌ల వెనుక జరిగే విషయాలు, వ్యక్తిగత అనుభవాలను తెలుసుకోవాలనుకునే వారు మాత్రమే సబ్‌స్క్రైబ్ చేయండి. నా వ్యక్తిగత పరిమితులను గౌరవిస్తున్నందుకు ధన్యవాదాలు” అని పాయల్ తెలిపారు.
తన సబ్‌స్క్రిప్షన్‌లో అభిమానులతో వ్యక్తిగత ఆలోచనలు, రోజువారీ జీవితానికి సంబంధించిన అప్డేట్లు మాత్రమే పంచుకుంటానని, దీనికి మించి ఎలాంటి అంచనాలు పెట్టుకోవద్దని ఆమె స్పష్టం చేశారు. దీంతో పాయల్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

