విజయ్ సినిమా రిలీజ్‌పై క్లారిటీ

విజయ్ సినిమా రిలీజ్‌పై క్లారిటీ

దళపతి విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా కెనడా డిస్ట్రిబ్యూటర్ చేసిన పోస్ట్‌తో రిలీజ్ డేట్‌పై చర్చ మొదలైంది.

కెనడాకు చెందిన యార్క్ సినిమాస్ సోషల్ మీడియాలో, జులై 24 నుంచి కెనడాలో ‘జన నాయగన్’ సినిమాని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలోనే టికెట్ బుకింగ్స్ కూడా ప్రారంభమవుతాయని వెల్లడించింది. దీంతో జులై 24 విడుదల దాదాపు ఖరారైనట్లేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి. భారత్‌లో మాత్రం ఒక రోజు ముందుగానే సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

ఇక సెన్సార్ బోర్డు సూచించిన మార్పులను చిత్రబృందం అంగీకరించినట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో సెన్సార్ సర్టిఫికెట్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించనుంది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పటికే జులై 24 విడుదలకు సిద్ధంగా ఉండాలని సమాచారం అందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Related Articles