అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘రంభ ఊర్వశి మేనక’ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. చంద్రమోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సురభి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ఈ సినిమా నుంచి ‘నా కంటి మీద కునుకే’ అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించిన ఈ పాటను ధనుంజయ్ ఆలపించగా, చేతన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చారు.
అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. విడుదలైన ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుండగా, సినిమాపై కూడా ఆసక్తి మరింత పెరుగుతోంది.

