ఓ పక్క మంచు కుటుంబంలో గొడవలు ఇంకో పక్క అల్లు అర్జున్ అరెస్ట్‌తో టాలీవుడ్‌లో హీట్ వాతారవరణం ఏర్పడింది. అయితే ఈ సమయంలోనే మోహన్‌బాబుపై కేసు ఉంది, ఆయన కూడా అరెస్ట్ అవుతారు అంటూ పలు వార్తలు రాగా దీనిపై తాను బయట కనిపించకుండా తిరుగుతున్నారు అంటూ వదంతులు లేపారు. అయితే దీనిపై ఇపుడు క్లారిటీ మోహన్ బాబు ఇచ్చేసారు. తనపై ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు అని తాను తనపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండించారు. అలాగే తనకి ముందస్తు బెయిల్ రద్దు అయ్యింది అనే వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదు అని, ప్రస్తుతం తన ఆరోగ్యరీత్యా చికిత్స తీసుకుంటున్నాను అని మోహన్‌బాబు తెలిపారు.

- December 14, 2024
0
106
Less than a minute
You can share this post!
editor