డేంజ‌ర్ జోన్‌లో మెహ‌బూబ్‌, న‌య‌న్..

డేంజ‌ర్ జోన్‌లో మెహ‌బూబ్‌, న‌య‌న్..

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ బిగ్‌బాస్ షో తెలుగు సీజ‌న్ 8 ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఏడు వారాలు కంప్లీట్ చేసుకున్న ఈ షో 8వ వారం చివ‌రిరోజుకు చేరుకుంది. ఇప్ప‌టికే హౌస్ నుండి బేబక్క, శేఖర్ భాషా, అభయ్, సోనియా, ఆదిత్య, నైనికా, కిరాక్ సీత ఎలిమినేట్ అవ్వ‌గా.. గ‌త వారం నాగ‌మ‌ణికంఠ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఈ వారం హౌస్‌ నుండి ఎవ‌రు ఎలిమినేట్ అవుతారు అనేదానిపై బిగ్ బాస్ ప్రేక్ష‌కులలో ఆసక్తి మొద‌లైంది.

 ఈ వారం నామినేష‌న్స్‌లో ఎవ‌రు ఉన్నారు అనేది చూసుకుంటే.. నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావనిలు నామినేష‌న్‌లో ఉన్నారు. ఇందులో ఈ వారం అత్య‌ధిక ఓటింగ్ నిఖిల్‌కు ఉండ‌డంతో టాప్ ప్లేస్‌లో కొన‌సాగుతుండ‌గా.. ప్రేర‌ణ రెండో స్థానంలో కొన‌సాగుతోంది. కొత్త మెగా చీఫ్ విష్ణుప్రియ మూడు, పృథ్వీ నాలుగో స్థానంలో ఉన్న‌ట్లు స‌మాచారం. ఇక త‌క్కువ ఓటింగ్‌తో డేంజ‌ర్ జోన్‌లో మెహ‌బూబ్‌తో పాటు న‌య‌న్ పావ‌నీలు ఉన్న‌ట్లు స‌మాచారం. వీరిద్ద‌రిలో ఎవ‌రు ఎలిమినేట్ అవుతారో అనేది ఆదివారం తెలియ‌నుంది. మ‌రోవైపు గ‌త‌వారం ఎపిసోడ్‌లో నాగ మ‌ణికంఠ‌ను ఎలిమినేట్ చేస్తూ.. వ‌చ్చే వారం ఊహించ‌ని ట్విస్ట్ ఉంటుంద‌ని నాగార్జున చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఆ ట్విస్ట్ ఏంటి అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

administrator

Related Articles