మన తెలుగు హీరో చిరంజీవి ఏ ఎమోషన్‌ని అయినా అద్భుతంగా పండించగలరు అని అందరికీ తెలిసిందే. తనని చాలావరకు ఫుల్ మాస్ హీరోగానే చాలామంది అనుకుంటారు కానీ, తన వింటేజ్ కామెడీ టైమింగ్ అయితే ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. కానీ దీనిని ప్రెజెంట్ చాలా మిస్ అవుతున్నామని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. తన వింటేజ్ మూవీస్ అన్నయ్య, జై చిరంజీవ తదితర సినిమాల్లో చిరు కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరి రీసెంట్‌గా అయితే మొన్న “వాల్తేరు వీరయ్య” లో కొంచెం కనిపించింది కానీ లేటెస్ట్‌గా ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన స్పాంటేనియస్ కామెడీ టైమింగ్ వైరల్‌గా మారింది. యువ హీరో సత్యదేవ్ నటించిన “జీబ్రా” ప్రీ రిలీజ్‌లో అలా సడెన్‌గా తనలోకి వాల్తేరు వీరయ్య అలా వచ్చి వెళ్ళాడు. దీనితో ఈ క్లిప్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్‌గా మారింది. తన కామెడీ టైమింగ్‌ని పర్ఫెక్ట్‌గా వాడుకునే సినిమాలు రావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.

- November 13, 2024
0
26
Less than a minute
Tags:
You can share this post!
administrator