మనీషా కొయిరాలా మాట్లాడుతూ హీరామండి 2 కోసం తాను ఎంతో హ్యాపీగా ఉన్నానని; సైడ్ రోల్స్ పట్ల తనకు ఆసక్తి లేదని చెప్పింది. నటి మనీషా కొయిరాలా హీరామండి రెండవ సీజన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఒక ఇంగ్లీషు పత్రికకి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, మనీషా పాత్రల పట్ల తనకున్న ఎంపిక విధానాన్ని, అర్ధవంతమైన పని పట్ల తన అభిరుచిని షేర్ చేసింది. హీరామండి రెండవ సీజన్ ఈ ఏడాది జూన్‌లో ప్రకటించబడింది. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన హీరామండి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది.
సంజయ్ లీలా భన్సాలీ హీరామండిలో మల్లికా జాన్‌గా అద్భుతమైన పునరాగమనం చేసిన మనీషా కొయిరాలా, షో రెండవ సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆమె ప్రాజెక్ట్ గురించి హ్యాపీగా ఉండగా, బన్సాలీ తన కొత్త ప్రాజెక్ట్ లవ్ అండ్ వార్‌పై దృష్టి సారించినందున, ప్రస్తుతం తనకు ఎటువంటి అప్‌డేట్‌లు తెలియవని ఆమె ఒక ఇంగ్లీష్ పత్రికలో షేర్ చేసింది. హీరామండి 2 గురించి మనీషా ఇలా షేర్ చేశారు, ఇది ఎప్పుడు మొదలవుతుందో నాకు తెలియదు. సంజయ్ ప్రస్తుతం లవ్ అండ్ వార్ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాతే దానిపై ఒక ఆలోచన వస్తుందని భావిస్తున్నాను. కానీ హీరామండి 2 ప్రకటన పట్ల నేను చాలా ఎగ్జైట్‌గా ఉన్నాను. ఇది జీవితకాల చాలా పెద్ద ప్రాజెక్ట్.