మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల నేపథ్యంలో సినీ నటుడు మంచు మోహన్ బాబు జర్నలిస్ట్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటనలో జర్నలిస్ట్‌కు తీవ్రగాయాలు కాగా.. మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలి అంటూ జర్నలిస్ట్ సంఘాలు అన్నీ ధర్నా చేయడం మొదలుపెట్టాయి. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి మోహన్ బాబు క్షమాపణలు తెలుపగా.. తాజాగా ఈ విషయంపై నటుడు మంచు మనోజ్ స్పందించాడు. ఈ ఘటనలో మీడియా తప్పు ఏమీ లేదు. నిస్సహాయ స్థితిలో నేను మీడియాను లోపలికి తీసుకువెళ్లాను. మా ఇంట్లోకి నన్ను అనుమతించకపోవడంతోనే మీడియా ప్రతినిధులను వెంటబెట్టుకుని తీసుకువెళ్లా. లోపలికి వెళ్లిన అనంతరం తనపై దాడి జరిగింది. ఈ ఘటనలో అసలు మీడియా తప్పు లేదు అంటూ మనోజ్ చెప్పుకొచ్చాడు.

- December 14, 2024
0
21
Less than a minute
You can share this post!
editor