మల్టీస్టారర్‌ సినిమా కోసం శ్రీలంకలో మమ్ముట్టి, మోహన్‌ లాల్‌..

మల్టీస్టారర్‌ సినిమా కోసం శ్రీలంకలో మమ్ముట్టి, మోహన్‌ లాల్‌..

మాలీవుడ్‌ నుండి లీడింగ్ హీరోల్లో మమ్ముట్టి, మోహన్‌ లాల్‌  టాప్‌లో ఉంటారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ స్టార్ యాక్టర్ల కాంబోలో సినిమా వస్తుందంటే క్రేజ్‌ ఎలా ఉంటుంది. సిల్వర్ స్క్రీన్‌పై అలాంటి సందడి కనిపించే టైం రాబోతోంది. మహేష్ నారాయణన్‌ డైరెక్షన్‌లో రాబోతున్న ఈ మల్టీస్టారర్‌ ప్రాజెక్ట్‌ షూటింగ్‌ దశలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా 150వ రోజు షూటింగ్ శ్రీలంకలో కొనసాగుతోంది. ఈ సినిమాలో స్టార్‌ యాక్టర్లు ఫహద్ ఫాసిల్‌, కుంచకో బోబన్, నయనతార, ఆంటోజోసెఫ్‌, రెంజిపానికర్‌, షాహిన్‌ సిద్దిఖీ, దర్శన్‌ రాజేంద్రన్‌, ప్రకాష్ బెలవడి ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. శ్రీలంకలోని  గ్రీనరీలో షూటింగ్‌ స్పాట్‌కు సంబంధించిన స్టిల్స్‌తోపాటు మమ్ముట్టి అండ్ మోహన్‌లాల్‌ టీం ఫొటోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.

administrator

Related Articles