డిటెక్టివ్‌గా మమ్ముట్టి.. ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్సు’…!

డిటెక్టివ్‌గా మమ్ముట్టి.. ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్సు’…!

మ‌ల‌యాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా సినిమా డొమినిక్ అండ్ ది లేడీస్ పర్సు. త‌మిళ అగ్ర ద‌ర్శ‌కుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. మ‌మ్ముట్టి సొంత ప్రొడ‌క్ష‌న్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రిప‌బ్లిక్ డే కానుక‌గా జ‌న‌వ‌రి 23న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలోనే సినిమా నుండి ట్రైల‌ర్‌ను లాంచ్ చేశారు. ఈ సినిమా ట్రైల‌ర్ చూస్తుంటే.. మమ్ముట్టి ఇందులో డొమినిక్ అనే డిటెక్టివ్ పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడు. ఆసుప‌త్రిలో దొరికిన లేడీస్ పర్సు చుట్టూ ఈ క‌థ తిరుగుతుందని తెలుస్తోంది. దొరికిన ఆ లేడీస్ ప‌ర్స్ ఎవ‌రిది అనే విషయాన్ని డొమినిక్ క‌నిపెడతాడా.. ఇంత‌కీ ఆ ప‌ర్స్‌లో ఏముంది.. ఈ ప‌ర్స్‌కి, మ‌ర్డ‌ర్స్‌కి సంబంధం ఏంటి అనేది తెలియాలంటే ఈ సినిమా వ‌చ్చేవ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. డా.నీర‌జ్ రాజ‌న్ ఈ సినిమాకు క‌థ‌ను అందిస్తుండ‌గా.. గోకుల్ సురేష్, సుస్మితా భట్, విజి వెంకటేష్, వినీత్, విజయ్‌బాబు త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో యాక్ట్ చేయబోతున్నారు.

editor

Related Articles