నటి మల్లికా షెరావత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మర్డర్ సినిమాతో ఈ భామ యువత హృదయాలను కొల్లగొట్టింది. గ్లామర్ పాత్రలతో మెప్పించే ఈ భామ నటుడు ఇమ్రాన్ హష్మీతో నటించిన బోల్డ్ సన్నివేశాలు అప్పట్లో చర్చనీయాంశం అయ్యాయి కూడా. ఈ భామ ఎక్కువగా ఐటెం సాంగ్స్‌తో ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ.. తాను ప్రస్తుతం ఒంటరిగా ఉన్నట్లు చెప్పింది. తన ఫ్రెంచ్ ప్రియుడు సిరిల్ ఆక్సెన్‌ఫాన్స్‌తో బ్రేకప్ అయినట్లు తెలిపింది. అవును ఇది నిజం. మేమిద్దరం చాలా కాలం పాటు కలిసి ఉన్నాం. అయితే.. ఇప్పుడు కాదు. ఈ రోజుల్లో సరైన వ్యక్తి దొరకడం చాలా కష్టం. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నాను. అని మల్లికా అంది. పెళ్లి గురించి మాట్లాడుతూ.. దానిపై తనకు ఆసక్తి లేదంది. అలా అని తాను పెళ్లికి వ్యతిరేకం కాదంది. భవిష్యత్తులో తనకు కనెక్ట్ అయ్యే వ్యక్తిపై ఇది ఆధారపడి ఉంటుందని అంది. మర్డర్, డర్టీ పాలిటిక్స్, దశావతారం వంటి సినిమాల్లో మల్లికా యాక్ట్ చేసింది.

- November 28, 2024
0
23
Less than a minute
You can share this post!
editor