హీరో సందీప్ కిషన్ తన కెరీర్‌లో 30వ సినిమాగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘మజాకా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాగా ఈ సినిమా రానుంది. అయితే, ఈ సినిమాని ఫిబ్రవరి 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ, తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను వాయిదా వేసినట్లు సినిమా యూనిట్ తెలిపింది. ఈ సినిమాని శివరాత్రి పండుగ కానుకగా ఫిబ్రవరి 26న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ఓ సరికొత్త పోస్టర్‌తో వారు కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా రావు రమేష్, మన్మథుడు ఫేం అన్షు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా రాజేష్ దండ ఈ సినిమా నిర్మాత.

- February 8, 2025
0
19
Less than a minute
Tags:
You can share this post!
editor