హీరో మహేష్‌బాబు త్వరలోనే ఫ్యాన్స్‌కు ఎస్‌ఎస్‌ఎంబీ 29 రూపంలో బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్ అందించేందుకు రెడీ అవుతున్నారని తెలిసిందే. సూపర్ స్టార్ నుండి కొత్త అప్‌డేట్ ఏమైనా వస్తుందా..? అని ఎదురుచూస్తున్న అభిమానుల్లో కొత్త స్టిల్ జోష్ నింపుతోంది. మహేష్‌బాబు తాజాగా షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఇంతకీ ఈ షూట్ సినిమా కోసమంటున్నారా.. కాదు.. యాడ్ కోసం ఇలా ఫ్రెష్ లుక్‌లోకి మారిపోయాడు. టీషర్ట్ అండ్ జీన్స్ కాంబోలో స్టైలిష్ లాంగ్ కర్లీ హెయిర్‌తో యాడ్ షూట్ మెంబర్‌తో చిరునవ్వులు చిందిస్తున్న లుక్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. మహేష్‌బాబు చేసే యాడ్స్‌కు సూపర్ క్రేజ్ ఉంటుందని తెలిసిందే. మరి ఈసారి ఏ వాణిజ్య ప్రకటనలో కనిపించబోతున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. మహేష్‌బాబు తాజా ఫొటో చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఎస్‌ఎస్‌ఎంబీ 29 2025 ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ రూ.1,000 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కనుండగా.. హాలీవుడ్ యాక్టర్లు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో భాగం కాబోతున్నారని సమాచారం. ఈ సినిమాని 2027 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వినికిడి.

- November 21, 2024
0
26
Less than a minute
Tags:
You can share this post!
editor