ఫారిన్ టూర్ నుండి వచ్చిన మ‌హేష్ బాబు.. లేటెస్ట్ లుక్ అదిరిపోయిందిగా…!

ఫారిన్ టూర్ నుండి వచ్చిన మ‌హేష్ బాబు.. లేటెస్ట్ లుక్ అదిరిపోయిందిగా…!

హీరో మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న‌ట్టు తెలుస్తుండ‌గా, త్వ‌ర‌లో మూడో షెడ్యూల్ జ‌రుపుకోనుంది. అందుకే మ‌హేష్ బాబు త‌న వెకేష‌న్ పూర్తి చేసుకుని హైద‌రాబాద్‌లో అడుగుపెట్టారు. రెడ్ కలర్ జాకెట్, లోపల బ్లూ టీ షర్ట్, బ్రౌన్ ప్యాంట్‌లో మహేష్ బాబు విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వడంతో కెమెరాలు అన్ని ఆయ‌న చుట్టే తిరిగాయి. ప్ర‌తి ఒక్క‌రు మ‌హేష్ బాబుని త‌మ కెమెరాల‌లో బంధించేందుకు పోటీప‌డ్డారు. మ‌హేష్ బాబు లేటెస్ట్ లుక్స్ అదిరిపోయాయ‌ని నెటిజ‌న్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

editor

Related Articles