చిరంజీవి విశ్వంభరకు సూపర్ క్రేజ్‌.. ఫస్ట్ ప్లేస్‌లో రామ రామ సాంగ్‌ ట్రెండింగ్‌..

చిరంజీవి విశ్వంభరకు సూపర్ క్రేజ్‌.. ఫస్ట్ ప్లేస్‌లో రామ రామ సాంగ్‌ ట్రెండింగ్‌..

టాలీవుడ్ హీరో చిరంజీవి  కాంపౌండ్ నుండి వస్తోన్న సోషియో ఫాంటసీ ప్రాజెక్ట్‌ విశ్వంభర. కాగా ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్‌ సింగిల్‌ రామ రామను విడుదల చేశారని తెలిసిందే. ఈ పాటకు మ్యూజిక్ లవర్స్‌ నుండి మంచి స్పందన వస్తోంది. బింబిసార ఫేం వశిష్ఠ మల్లిడి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా న‌టిస్తుండగా.. అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్, ర‌మ్య ప‌సుపులేటి, సురభి, ఈషా చావ్లా, ఆష్రిత వేముగంటి నండూరి ఇతర కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్‌ సింగిల్‌ రామ రామను విడుదల చేశారని తెలిసిందే. ఈ పాటకు మ్యూజిక్ లవర్స్‌ నుండి మంచి స్పందన వస్తోంది. ఈ పాట యూట్యూబ్‌లో నంబర్‌ 1 ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతోంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను ఎంఎం కీరవాణి కంపోజ్‌ చేయగా.. శంకర్‌ మహదేవన్‌, ఐరా ఉడుపి, లిప్సికా భాష్యం పాడారు. రామ రామ సాంగ్ విశ్వంభరకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని తాజా వార్త చెప్పకనే చెబుతోంది. ఈ సినిమాని వంశీ, ప్రమోద్ విక్రమ్‌ తెరకెక్కిస్తుండగా.. ఇప్పటికే రిలీజ్ చేసిన విశ్వంభర టైటిల్‌ లుక్‌, కాన్సెప్ట్‌ వీడియో మిలియన్ల సంఖ్యలో వ్యూస్‌ రాబడుతూ సినిమాపై సూపర్ హైప్‌ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాని మే 9న రిలీజ్ అవుతుండగా.. నిర్మాతల నుండి స్పష్టత రావాల్సి ఉంది.

editor

Related Articles