ది న్యూ ట్రెండ్ సెట్టర్‌గా ‘ఎం4ఎం’ ట్రైలర్

ది న్యూ ట్రెండ్ సెట్టర్‌గా ‘ఎం4ఎం’ ట్రైలర్

తెలుగు సినీ పరిశ్రమలో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఎం4ఎం’ (మోటివ్ ఫర్ మర్డర్) ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అమెరికన్ నటి జో శర్మా, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్కంఠభరితమైన కథనం, థ్రిల్లింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మర్డర్ మిస్టరీ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సినిమా చూసి కిల్లర్ ఎవరో గెస్ చేస్తే ఒక్కొక్కరికి రూ.1 లక్ష బహుమతి ఇస్తామని దర్శకుడు ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది. పీవీఆర్ ఐనాక్స్ ద్వారా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రత్యేక ప్రదర్శన పొందిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Articles