ఇచ్చుకుందాం బేబీ పోస్టర్‌ రిలీజ్‌..

ఇచ్చుకుందాం బేబీ పోస్టర్‌ రిలీజ్‌..

విశ్వక్‌సేన్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘లైలా’. రామ్‌ నారాయణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో ‘ఇచ్చుకుందాం బేబీ..’ అంటూ సాగే రెండో గీతాన్ని ఈ నెల 23న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా మంగళవారం సాంగ్‌ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.

లియోన్‌ జేమ్స్‌ సంగీతంలో రొమాంటిక్‌ గీతంగా ఆకట్టుకుంటుందని, నాయకానాయికల మధ్య కెమిస్ట్రీ ప్రధానాకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో విశ్వక్‌సేన్‌ బ్యూటీపార్లర్‌ నడిపించే మోడల్‌ సోనూగా, లైలా అనే అమ్మాయిగా రెండు పాత్రలను పోషిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభించిందని, రొమాన్స్‌, యాక్షన్‌, కామెడీ అంశాలతో ఈ సినిమా మెప్పిస్తుందని మేకర్స్‌ తెలిపారు. ఈ సినిమాకి సంగీతం: లియోన్‌ జేమ్స్‌.

editor

Related Articles