హైదరాబాద్‌లో ఇన్‌కం ట్యాక్స్ దాడులు రెండోరోజైన బుధవారం కొనసాగుతున్నాయి. పుష్ప-2 సినిమాకు పెట్టిన బడ్జెట్.. వచ్చిన ఆదాయంపై అధికారులు వ్యత్యాసం ఎంతో తెలుసుకునే పనిలో పడ్డారు. ఆయా సంస్థలు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ భారీగా ఉండడంతో ఐటీ అధికారుల రెండోరోజు సైతం తనిఖీలు చేపడుతున్నారు. దాదాపు 55 బృందాలు రంగంలోకి దిగాయి. నిర్మాత దిల్ రాజు నివాసంతో పాటు కార్యాలయాలు, మైత్రి మూవీ మేకర్స్ యజమాని నవీన్, సీఈవో చెర్రి, మ్యాంగో మీడియాలోనూ సోదాలు చేస్తున్నారు. ఐటీ దాడులు సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా ఇటీవల భారీగా కలెక్షన్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటీ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఇటీవల పలు సినిమాలకు భారీగా పెట్టుబడి పెట్టామని.. కడుతున్న ఇన్‌కం ట్యాక్స్ విషయంలో అధికారులు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

- January 22, 2025
0
18
Less than a minute
Tags:
You can share this post!
editor