ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న #RAPO23 చిత్రం రేపు (జూన్ 29) గ్రాండ్ పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభం కానుంది. “ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ ఉల్ఫ్” ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ స్టైలిష్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో రామ్ ‘వీర’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.
రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుమారు రూ.100 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారు. దీంతో ఇది రామ్ కెరీర్‌లోనే అత్యంత వ్యయభరితమైన చిత్రంగా నిలవనుంది.
సాంకేతిక విభాగంలో జాతీయ అవార్డు గ్రహీత తిరు సినిమాటోగ్రాఫర్‌గా, మలయాళ సంగీత దర్శకుడు సామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది.
పూజా కార్యక్రమం అనంతరం సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అన్ని పనులు పూర్తి చేసి 2026 డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలని చిత్రబృందం ప్రణాళిక రూపొందిస్తోంది. భారీ బడ్జెట్, బలమైన సాంకేతిక బృందంతో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

