‘లాపతా లేడీస్‌’ టైటిల్‌ ఛేంజ్!

‘లాపతా లేడీస్‌’ టైటిల్‌ ఛేంజ్!

కిరణ్‌ రావు డైరెక్షన్‌లో అమీర్‌ఖాన్‌ నిర్మించిన ‘లాపతా లేడీస్‌’ చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద పెద్ద విజయాన్ని మూటగట్టుకుంది. మహిళా సాధికారత, స్వేచ్ఛ ప్రధానాంశాలుగా ఉత్తర భారత గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకొంది. 2025 ఆస్కార్‌ బరిలో భారత్‌ తరపున అధికారిక సినిమాగా ఎంపికైన విషయం తెలిసిందే. ఉత్తమ విదేశీ సినిమా కేటగిరీలో ఆస్కార్‌ను దక్కించుకునేందుకు అమీర్‌ఖాన్‌, కిరణ్‌రావు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ఈ సినిమాని ప్రదర్శిస్తున్నారు. ఆస్కార్‌ ప్రచారం కోసం ఈ సినిమా టైటిల్‌ను ‘లాస్ట్‌ లేడీస్‌’గా మార్చుతున్నట్లు చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయిలో టైటిల్‌కు రీచ్‌ అయ్యేలా ఈ నిర్ణయం తీసుకున్నామని, హిందీ అర్థాన్ని స్ఫురించేలా ఇంగ్లీష్‌లో ‘లాస్ట్‌ లేడీస్‌’ అనే టైటిల్‌ పెట్టామని అమీర్‌ఖాన్‌ తెలిపారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

administrator

Related Articles