ప్రీమియర్లతో వస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’

ప్రీమియర్లతో వస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘చెన్నై లవ్ స్టోరీ’ జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా రిలీజ్‌కు ఒక రోజు ముందే, జులై 23న హైదరాబాద్‌తో పాటు తిరుపతిలో ప్రత్యేక పెయిడ్ ప్రీమియర్ షోలను చిత్రబృందం ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని విమల్ 70ఎంఎం, సంధ్య 70ఎంఎం, ప్రసాద్స్ మల్టీప్లెక్స్, ఏఎంబీ సినిమాస్, అల్లు సినిమాస్, పీవీఆర్ నెక్సస్, పీవీఆర్ ఏట్రియం, అపర్ణ సినిమాస్, సినీపోలిస్ టీఎన్‌ఆర్ నార్త్ సిటీ మాల్‌ సహా 9 థియేటర్లలో మొత్తం 14 షోలు ఖరారు చేశారు. ప్రేక్షకుల నుంచి డిమాండ్ పెరిగితే మరిన్ని షోలు పెరిగే అవకాశం ఉందని సమాచారం.

రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఎస్‌కేఎన్‌, సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మించగా, మణిశర్మ సంగీతం అందించారు. ‘కలర్ ఫొటో’, ‘బేబీ’ తర్వాత మరో హిట్ అందిస్తామనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. ప్రీమియర్ షోలకు వస్తున్న స్పందనతో సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధిస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Related Articles