తల్లి కాబోతున్న కియారా అద్వానీ..

తల్లి కాబోతున్న కియారా అద్వానీ..

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ త‌ల్లి కాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. బాలీవుడ్ క్యూట్ క‌పుల్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మ‌ల్హోత్రా త‌మ అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్పారు. త్వ‌ర‌లోనే తాము తల్లిదండ్రులు కాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా కొత్త ఫొటోను షేర్ చేశారు. 2023 ఫిబ్రవరిలో ఆమె ప్రియుడు సిద్ధార్థ్‌ మల్హోత్రాను ఘనంగా పెళ్లి చేసుకుంది కియారా. జైపూర్‌లోని ఓ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వీళ్ల పెళ్లి జరిగింది. అయితే పెళ్లి అయిన నాలుగు నెల‌ల‌కే కియారా అద్వానీ గ‌ర్భ‌వ‌తి అంటూ బాలీవుడ్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. దీంతో ఆ వార్త‌లు నిజమే అనుకున్నారు కియరా అభిమానులు. అయితే ఆ వార్త‌లు అబ‌ద్ద‌మంటూ త‌ర్వాత క్లారిటీ ఇచ్చింది ఈ హీరోయిన్. ఇదిలావుంటే తాజాగా నేను త‌ల్లిని కాబోతున్నానంటూ ఒక ఫొటోను షేర్ చేసింది. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మ‌ల్హోత్రా త‌మ రెండు చేతులు ముందుకు చాచి చిన్నారి సాక్స్ ఫొటో షేర్ చేశారు. మా జీవితాల్లోకి గొప్ప బహుమతి త్వరలో రాబోతోంది అంటూ ఈ ఫొటోకి క్యాప్షన్ పెట్టారు. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు, సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

editor

Related Articles