తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్, నటి సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ అమరన్. ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ అనే పుస్తకంలోని మేజర్ వరదరాజన్ కథ ఆధారంగా.. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో శివ కార్తికేయన్ ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఇదే పాత్రలో ఇంటికి వెళ్లి తన భార్యను సర్‌ప్రైజ్ చేశాడు శివ కార్తికేయన్.
శివ కార్తికేయన్ భార్య ఆర్తి కిచెన్‌లో పని చేసుకుంటుండగా.. అమరన్ మేజర్ ముకుంద్ గెటప్‌లో వెళ్లి సర్‌ప్రైజ్‌ను ఇచ్చాడు శివ కార్తికేయన్. ఇక శివను చూసిన ఆర్తి ఒక్కసారిగా షాక్ అయినట్లుగా కనిపించింది.