విజయ్ హీరోగా ‘రేపటి తీర్పు’?

విజయ్ హీరోగా ‘రేపటి తీర్పు’?

తమిళ  హీరో దళపతి విజయ్‌ ప్రస్తుతం తన 69వ సినిమాలో నటిస్తున్నారు. హెచ్‌.వినోద్‌ దర్శకుడు. రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని నిర్ణయించుకోవడంతో తన కెరీర్‌లో ఇదే ఆఖరి సినిమా అని విజయ్‌ చెప్పారు. ఈ నెల 26న రిపబ్లిక్‌ డే సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నామని నిర్మాతలు తెలిపారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి ‘నాలైయ తీర్పు’ (తెలుగులో ‘రేపటి తీర్పు’ అని అర్థం) అనే టైటిల్‌ను ఖరారు చేయబోతున్నారని తెలిసింది.

రాజకీయ రంగప్రవేశం చేస్తున్న దృష్ట్యా సింబాలిక్‌గా ఈ టైటిల్‌ బాగా సెట్‌ అవుతుందని విజయ్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్‌ చేస్తున్నారు. దళపతి విజయ్‌ గతంలో చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు, రాజకీయ పార్టీ స్థాపనకు దారితీసిన సంఘటనలను ప్రధానాంశాలుగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం.

editor

Related Articles