రిషబ్ శెట్టి నటిస్తోన్న బయోపిక్ శివాజీ మహారాజ్. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఖడ్గం చేత బట్టిన శివాజీ మహారాజ్‌గా వీరత్వం ఉట్టిపడే లుక్‌లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు రిషబ్ శెట్టి. లెజెండరీ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ నేపథ్యంలో హిస్టారికల్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీని సందీప్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాని 2027 జనవరి 1న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇది సినిమా కంటే ఎక్కువగా ఉండబోతుంది. అపారమైన అసమానతలను అధిగమించి.. మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి శాశ్వతమైన వారసత్వాన్ని సృష్టించిన యోధుడికి నివాళిగా వస్తోందని మేకర్స్ తెలియజేశారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.

- December 3, 2024
0
26
Less than a minute
You can share this post!
editor